" పోతామని తెలుసు "
పోతామని తెలుసు... పోతే యేడుస్తారని తెలుసు...
చావుంటుందని తెలుసు... ఏమి తీసుకుపోమని తెలుసు..
అయినా ఆశే చావదు మనిషికి... ఈ పరుగే ఆపడు మనిషి...
అయినా కళ్ళే తెరవడు మనిషి... ఈ ఇలలో మారడు మనిషి..
|| పోతామని||
నీవైనా నేనైనా చస్తే చేరేది కాటికే...
రాజైనా పెధైనా చివరికి మిగిలేది కాలే కర్రనే...
ఊపిరి పీలిస్తే జననం..ఊపిరి విడిస్తే మరణం...
ఆ రెంటి మధ్య యుద్ధం లో అవుతున్నమోయ్ దూరం...
||పోతామని||
కాలే కడుపును నింపేందుకు పిడికెడు అన్నం సరిపోదా...
వణికే కట్టెను ఆపేందుకు జానెడు గుడ్డే సరిపోదా...
భూమిలో కలిసే శరీరానికి ఆరడుగులే చాలు కదా...
బాధలో ఉన్న హృదయానికి చిటికెడు ప్రేమ స్వర్గం కాదా...
||పోతామని||
అబద్ధమాడి మోసం చేసి సంపాదించే లక్షలు కోట్లు...
తీసుకుపోవు పోతూ నీవు..చందనమైనా చివరికి బూడిదే...
పరుగుపందెంలో గెలిచిన నీవు జీవితంలో ఓడావని...
ప్రేమించే మనసే దూరం అయితే కాని తెలియదు నీకు...
||పోతామని||
A song written by one of my friend and follower on twitter...
Thanks Brahma for the Privilege :)
You can reach him @TheOnlyBrahma